కాంబినేషన్ కాదు.. కథ ముఖ్యం :  బెక్కెం వేణుగోపాల్

కాంబినేషన్ కాదు.. కథ ముఖ్యం :  బెక్కెం వేణుగోపాల్

టాటా బిర్లా మధ్యలో లైలా, నేను లోకల్, పాగల్, ప్రేమ ఇష్క్ కాదల్, సినిమా చూపిస్తా మామ, హుషారు లాంటి చిత్రాలతో సక్సెస్‌‌‌‌ఫుల్ ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతున్నారు బెక్కెం వేణుగోపాల్. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పదహారేళ్లుగా సినిమాలు చేస్తున్నా. నిర్మాతగా 12 సినిమాలు, వేరే బ్యానర్లతో కలిసి 4 సినిమాలు నిర్మించాను. నిర్మాతగా ఎంతో సంతృప్తిగా వున్నాను. అనుభవంతో పాటు అంకితభావం ఉంటేనే నిర్మాతగా సక్సెస్ సాధిస్తారు.

కానీ ప్రస్తుతం కథ కంటే కాంబినేషన్‌‌‌‌ను నమ్ముకుని ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. దీంతో సినిమా సూపర్‌‌‌‌ హిట్ అయినా లాభాలు రావడం లేదు. ఇక కొత్తవాళ్లతో రోటి, కపడ, రొమాన్స్ అనే సినిమాతో పాటు నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి కలిసి సుడిగాలి సుధీర్‌‌‌‌తో ఓ సినిమా చేస్తున్నా. ‘పాగల్’ ఫేమ్ నరేష్ దీనికి దర్శకుడు. ఓటీటీ కోసం అవికాగోర్‌‌‌‌‌‌‌‌తో స్వరూప్ దర్శకత్వంలో ఓ క్రేజీ థ్రిల్లర్ తీస్తున్నాం’ అన్నారు.