Prabha Atre: విషాదం.. గుండెపోటుతో ప్రముఖ గాయని మృతి

Prabha Atre: విషాదం.. గుండెపోటుతో ప్రముఖ గాయని మృతి

లెజెండరీ క్లాసికల్ సింగర్, పద్మ అవార్డుల గ్రహీత ప్రభా ఆత్రే(91) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ ఉదయం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను పూణెలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

ప్రభా ఆత్రే ప్రముఖ గాయని మాత్రమే కాదు.. ఉన్నత విద్యావంతురాలు కూడా. పూణేలోని ఫెర్గూసన్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పట్టా అందుకున్న ప్రభా ఆత్రే, లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసింది. ఆ తరువాత సంగీతంలో PhD కూడా సంపాదించింది. ఆమె డాక్టరల్ థీసిస్‌కు 'సర్గం' అనే పేరు పెట్టారు. ఆమె ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో పర్యటించి సంగీతంపై ఉపన్యాసాలు ఇచ్చింది. 

ప్రతిష్టాత్మక అవార్డులు

ప్రభా ఆత్రే పద్మశ్రీ (1990), పద్మ భూషణ్ (2002) మరియు పద్మ విభూషణ్ (2022) అవార్డులు అందుకున్నారు. అలాగే, 1991లో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. ఇవే కాకుండా రత్న అవార్డు, హఫీజ్ అలీ ఖాన్ అవార్డు వంటి జాతీయ-అంతర్జాతీయ అవార్డులు ఎన్నో ఉన్నాయి.