
స్వాతంత్ర్య సమరయోధుడు, సీపీఎం సీనియర్ నాయకుడు ఎన్ శంకరయ్య కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన శంకరయ్య దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాడు.
స్వాతంత్ర్య పోరాటంలో 9 ఏళ్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలోని 32 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులలో ఆయన ఒకరు. సైద్ధాంతిక విభేదాల కారణంగా దాని నుంచి విడిపోయిన ఆయన ఆ తర్వాత 1964లో సీపీఎంను ఆయన స్థాపించారు.
కమ్యూనిస్టు నాయకుడిగా సుదీర్ఘకాలం ఆయన రాజకీయాల్లో కొనసాగారు. అధికార డీఎంకే ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మకమైన తగైసల్ తమిజర్ అవార్డుతో సత్కరించింది. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లుగా ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ తెలిపారు.