బాలీవుడ్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ మృతి

V6 Velugu Posted on May 22, 2021

బాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ కన్నుమూశారు. 79 ఏళ్ల రామ్ లక్ష్మణ్ నాగ్ పూర్ లోని తన నివాసంలో ఇవాళ(శనివారం) తుదిశ్వాస విడిచారు. ఆయన చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

రామ్ లక్ష్మణ్ అసలు పేరు విజయ్ పాటిల్. 1975లో పండూ హవల్దార్ అనే మరాఠీ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంటరైయ్యారు. ఆ సినిమాకు తన స్నేహితుడు సురేంద్రతో కలిసి రామ్ లక్ష్మణ్ పేరుతో సంగీతం అందించారు. ఆ తర్వాత ఏడాదే సురేంద్ర చనిపోవడంతో .. విజయ్ పాటిల్ తన మిత్రుడి జ్ఞాపకార్థం రామ్ లక్ష్మణ్ పేరుతోనే కొనసాగారు. ఆయన హిందీ, మరాఠీ, భోజ్ పురి భాషల్లో 150కి పైగా సినిమాలకు మ్యూజిక్ అందించారు. 

బాలీవుడ్ సినిమాలు మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై, 100 డేస్, పత్తర్ కే పూల్ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. రాజశ్రీ బ్యానర్ లో ఆయన ఎక్కువ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. రామ్ లక్ష్మణ్ మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Tagged dies, Veteran music director, Raam Laxman, Nagpur

Latest Videos

Subscribe Now

More News