సత్యభామ మూవీ నుండి వెతుకు వెతుకు అనే పాట మే 15న విడుదల

సత్యభామ మూవీ నుండి వెతుకు వెతుకు అనే పాట మే 15న విడుదల

కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. అమరేందర్ అనే కీలక పాత్రను నవీన్ చంద్ర పోషిస్తున్నాడు. సుమన్ చిక్కాల తెరకెక్కిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకుడిగా వ్యవహరిస్తూ, స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లే అందించాడు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసిన మేకర్స్.. తాజాగా థర్డ్ సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించిన అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ ఇచ్చారు. ‘వెతుకు వెతుకు’ అంటూ సాగే పాటను ఈనెల 15న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికిసంగీతం అందిస్తున్నాడు.

ఓ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నేరస్తులను పట్టుకోవడంలో సత్యభామ చేసే సెర్చింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో ఈ పాట ఉండబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.