
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం కన్నుల పండువగా బతుకమ్మ సంబురం జరిగింది. నిజామాబాద్ కలెక్టరేట్లో సంబురాలు అంబరాన్నాంటాయి. ఎమ్మెల్యేలు డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి, ధన్పాల్సూర్యనారాయణ, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి పాల్గొన్నారు. మహిళలు గౌరీమాతకు ప్రదక్షిణలు చేసిన అనంతరం పాడిన పాటలు అక్కడున్నవారిని అలరించాయి.
నవీపేట్ మండలంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మోకాన్పల్లి అంగన్వాడీ సెంటర్లో బతుకమ్మ ఆడారు. లింగంపేట మండల సమాఖ్య ఆధ్వర్యంలో నాగన్నబావి వద్ద బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఇన్‌చార్జి డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీఎంఐబీ శ్రీనివాస్, ఎంపీడీవో నరేశ్, మండల సమాఖ్య అధ్యక్షురాలు సులోచన, ఏపీఎంలు, సీసీ పాల్గొన్నారు. - వెలుగు, ఫొటోగ్రాఫర్, నిజామాబాద్