విక్కీ కౌశల్ యాక్టింగ్ స్కూల్ వీడియో వైరల్

విక్కీ కౌశల్ యాక్టింగ్ స్కూల్ వీడియో వైరల్

ప్రముఖ నటి, సీరియల్ యాక్టర్ షిరీన్ మీర్జా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసింది. ప్రముఖ నటుడు, జాతీయ అవార్డు గ్రహిత విక్కీ కౌశల్ తో కలిసి ఆమె యాక్టింగ్ స్కూల్ లో చేసిన ఓ స్కిట్ కు సబంధించిన వీడియోను తన అభిమానులతో పంచుకుంది. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వీడియోలో, విక్కీ కౌశల్,  షిరీన్ కలిసి చేసిన నటనను మనం చూడొచ్చు. షిరీన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేసింది విక్కీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ  వీడియోను అభిమానులతో  పంచుకున్నాడు. యాక్టింగ్ స్కూల్ డేస్ మరిచిపోలేని రోజులు అంటూ విక్కీ పేర్కొన్నారు. 

షిరీన్ బుల్లితెరపై బిజీగా ఉండగా.. విక్కీ కౌశల్ సినిమాలతో బిజీగా మారాడు. చివరగా విక్కీ సర్దార్ ఉద్దమ్ సినిమాలో కనిపించాడు. ఫీల్డ్ మార్షల్ సామ్ మణిక్ షా బయోపిక్ లో విక్కీ నటించనున్నాడు. యురీ డైరెక్టర్ ఆదిత్య ధార్ తో  మరో సినిమా చేసేందుకు కూడా విక్కీ సంతకం చేశాడు. ఈ సినిమాలో విక్కీ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మహాభారత పాత్రల్లో ఒక్కటైన అశ్వథ్థామ రోల్ లో విక్కీ కనిపించనున్నాడు. యురి, ద సర్జికల్ స్ట్రైక్, సంజు, లస్ట్ స్టోరీస్ వంటి సినిమాలతో విక్కీ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సారా అలీ ఖాన్ తో కలిసి ప్రస్తుతం ఓ సినిమాలో కూడా నటిస్తున్నాడు. మరోవైపుజజ ఫరహాన్ అక్తర్ జీ లే జరా సినిమాలో కూడా విక్కీ ఓ పాత్రలో కనిపించనున్నాడు. ఇదే సినిమాలో కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, అలియా భట్ కూడా లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక పోతే.. గతనెలలో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ను విక్కీ పెళ్లాడిన విషయం తెలిసిందే. రెండేళ్ల డేటింగ్ తర్వాత ఈ జంట పెళ్లితో ఒక్కటైంది.