రేప్ చేసినోడిని పెండ్లి చేస్కుంట

రేప్ చేసినోడిని పెండ్లి చేస్కుంట
  • సుప్రీంకోర్టులో బాధితురాలి పిటిషన్.. కొట్టేసిన బెంచ్

తనను రేప్ చేసిన వ్యక్తిని పెండ్లి చేసుకుంటానని, పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఆమె  పిటిషన్‌‌‌‌ను కోర్టు కొట్టేసింది. మరోవైపు తాను రేప్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు బెయిల్ ఇవ్వాలంటూ అతడు వేసిన మరో పిటిషన్‌‌‌‌ను కూడా కోర్టు కొట్టేసింది.

న్యూఢిల్లీ: తనను రేప్ చేసిన వ్యక్తిని పెండ్లి చేసుకుంటానని, పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఆమె వేసిన పిటిషన్‌‌‌‌ను కోర్టు కొట్టేసింది. మరోవైపు తాను రేప్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు బెయిల్ ఇవ్వాలంటూ అతడు వేసిన మరో పిటిషన్‌‌‌‌ను కూడా కొట్టేసింది. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టు నిర్ణయం తీసుకుందని, తాము ఇందులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్‌‌‌‌ దినేశ్ మహేశ్వరితో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే బాధితురాలు ట్రయల్ కోర్టుకు వెళ్లవచ్చని సూచించింది. కేరళలోని వయానాడ్ జిల్లా కొట్టియూర్‌‌‌‌‌‌‌‌లో సెయింట్ సెబాస్టియన్ చర్చి ప్రీస్ట్‌‌‌‌గా రాబిన్ వడక్కుమ్‌‌‌‌చెర్రి పని చేసేవాడు. అక్కడ ఓ మైనర్‌‌‌‌‌‌‌‌ను రేప్ చేశాడు. 2017 ఫిబ్రవరిలో ఆ అమ్మాయి ఓ పాపకు జన్మనిచ్చింది. సంచలనం సృష్టించిన ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు.. కెనడా పారిపోవాలని రాబిన్ ప్రయత్నించాడు. అయితే అంతకుముందే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన స్పెషల్ పోక్సో కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రాబిన్ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. బెయిల్ కోసం అతడు పెట్టుకున్న పిటిషన్‌‌‌‌ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.