మా గోల్డ్‌‌ ఉందా.. లేదా..? చెన్నూరు ఎస్‌‌బీఐ ఎదుట బాధితుల ఆందోళన

మా గోల్డ్‌‌ ఉందా.. లేదా..? చెన్నూరు ఎస్‌‌బీఐ ఎదుట బాధితుల ఆందోళన

చెన్నూరు, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌‌ ఎస్‌‌బీఐ గోల్డ్‌‌ స్కామ్‌‌ బాధితులు సోమవారం ఉదయం బ్యాంక్‌‌ ఎదుట ధర్నాకు దిగారు. స్కామ్‌‌ జరిగి 20 రోజులు అవుతున్నా.. తమ నగలు ఉన్నాయా..? లేవా..? అనే విషయాన్ని బ్యాంక్‌‌ ఆఫీసర్లు చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసర్లు స్పందించి గోల్డ్‌‌ రికవరీ అయిందా..? లేదా..? గోల్డ్‌‌ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. 

విషయం తెలుసుకున్న పోలీసులు బ్యాంక్‌‌ వద్దకు చేరుకొని.. స్కామ్‌‌పై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు. కాగా పోలీసులు ఇప్పటివరకు 19 కేజీల బంగారాన్ని రికవరీ చేసినట్లు తెలుస్తోంది.