టీ20ల్లో స్వేచ్ఛతో ఆడితేనే విజయం: వీవీఎస్ లక్ష్మణ్

టీ20ల్లో స్వేచ్ఛతో ఆడితేనే విజయం: వీవీఎస్ లక్ష్మణ్

రేపటి నుంచి భారత్- న్యూజిలాండ్ జట్లమధ్య జరగబోయే టీ20 సిరీస్ కోసం  భారత జట్టు ఇప్పటికే న్యూజిలాండ్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈనెల 30 వరకు టీ20 సిరీస్ జరగనుంది. రేపు వెల్లింగ్టన్ వేదికగా తొలి టీ-20 మ్యాచ్. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు లేకుండానే ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా నాయకత్వంలో భారత జట్టు న్యూజిలాండ్ గడ్డపై పర్యటిస్తోంది.  టీ20 ప్రపంచకప్ లో తమ జట్టు ప్రదర్శన నిరాశపర్చినా.. తప్పులను సరిచేసుకుంటూ ముందుకు సాగుతామన్నాడు హార్థిక్ పాండ్యా. టీ20 ప్రపంచకప్ వైఫల్యాల నుంచి  బయటపడి.. తరువాతి టార్గెట్ పై ఫోకస్ చేస్తామన్నాడు. 

తొలి రోజు ప్రాక్టీస్ సెషన్ లో స్టాండింగ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొన్నాడు. ప్రాక్టీస్ సెషన్ ముందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీ20 మ్యాచ్ లు పూర్తి స్వేచ్ఛగా ఆడితేనే విజయం సాధిస్తారని అన్నాడు. ప్రతీ ప్లేయర్ జట్టు పరిస్థితులను అంచనా వేస్తూ ఆట ఆడటం చాలా ముఖ్యమన్నాడు.