శైలేష్ కొలనుతో వెంకటేష్ 75వ సినిమా

శైలేష్ కొలనుతో వెంకటేష్ 75వ సినిమా

విక్టరీ వెంకటేష్ రాబోయే తన 75 సినిమా కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అందుకు చాలామంది యువ డైరెక్టర్లతో చర్చలు జరిపి, చివరికి శైలేష్ కొలనుతో సినిమా చేయబోతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో తీయబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈనెల 26న జరగనున్నాయి. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.