బెజవాడ బాబాయ్ హోటల్ లో వెంకీ..

బెజవాడ బాబాయ్ హోటల్ లో వెంకీ..

విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న 75వ మూవీ సైంధవ్ . 2024 జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్ ఈ మూవీని హిట్ మూవీ పేం శైలేష్ కొలను డైరెక్ట్ చేశారు. తెలుగు ,తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.  దీందో మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. 

 ప్రమోషన్స్ లో భాగంగా విక్టరీ వెంకటేశ్, మూవీ టీం ఏపీలో సందడి చేస్తుంది. డిసెంబర్ 11న మధ్యాహ్నం వీవీఐటీ కాలేజీలో ,కేఎల్ యూ యూనివర్శిటీ విద్యార్థుల మధ్య సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. దుర్గమ్మ దర్శనం అనంతరం టిఫిన్ చేసేందుకు బాబాయ్ హోటల్ కు వచ్చారు. దీంతో  అభిమానులు,స్థానికులు  వెంకటేష్ తో సెల్ఫీ లు దిగేందుకు ఎగబడ్డారు. అంతకుముందు బస్సులో జర్నీ చేశారు.   ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 సైంధవ్ మూవీలో  శ్రద్దా శ్రీనాథ్, బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్సిద్దిఖీ, ఆర్య,రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.  ఈ మూవీని నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.