సాక్సులు అమ్ముకుంటున్న బాలుడు.. ఆదుకున్న సీఎం

సాక్సులు అమ్ముకుంటున్న బాలుడు.. ఆదుకున్న సీఎం

లూధియానా: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. వాటిలో కొన్ని వైరల్ అవ్వడాన్ని చూస్తుంటాయి. అయితే ఇలాంటి వీడియోలు, ఫొటోల వల్ల కొన్ని సందర్భాల్లో కొందరికి మేలు కూడా జరుగుతుంది. తాజాగా ఇలాంటి ఓ ఘటన లూధియానాలో జరిగింది. వివరాలు.. పంజాబ్‌‌లోని లూధియానాలో ఓ పదేళ్ల కుర్రాడు వీధుల్లో షూ సాక్సులు అమ్ముకుంటున్న వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్‌‌ దృష్టిలో పడింది. వంశ్ సింగ్ అనే  ఆ బాలుడి గురించి ఆర్థిక పరిస్థితి, అతడు స్కూల్ డ్రాపవుట్ అని తెలుసుకున్న అమరిందర్ సింగ్ ఆదుకోవడానికి ముందుకొచ్చారు. వంశ్ సింగ్‌‌ ‌కుటుంబానికి సాయంగా రూ.2 లక్షలను ప్రకటించారు. అతడి చదువు కొనసాగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.