మెట్రోలో బీడీ తాగిన ప్రయాణికుడు.. అందరూ గుడ్లప్పగించి చూశారు.. !

మెట్రోలో బీడీ తాగిన ప్రయాణికుడు.. అందరూ గుడ్లప్పగించి చూశారు.. !

ఓ వైరల్ వీడియో కారణంగా ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈసారి మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి బీడీ వెలిగిస్తూ కనిపించాడు. అయితే సంఘటన జరిగిన ఖచ్చితమైన తేదీ, ప్రదేశం  మాత్రం తెలియదు.

ఈ వైరల్ వీడియోలోఓ వృద్ధుడు తన జేబులో నుంచి బీడీని తీసి ప్రయాణికులతో నిండిన మెట్రోలో వెలిగించడాన్ని చూడవచ్చు. అతను అలా బహిరంగంగా బీడీ వెలిగించినందుకు కొంతమంది ఇతర ప్రయాణీకులు అభ్యంతరం వ్యక్తం చేయడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు. కానీ అదేం పట్టకుండా ఆ వ్యక్తి తన వద్ద కూడా టిక్కెట్టు ఉందని బదులివ్వడం అందర్నీ ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేసింది.

Also Read :- ఆమె జుట్టే నాగు పాము.. షాక్ అవుతున్న నెటిజన్లు

ఈ వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడంతో  వందలాది మంది యూజర్స్.. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, ఢిల్లీ మెట్రో అధికారుల నుంచి సమాధానం కోరడంతో వెంటనే వైరల్ అయింది. అయితే, ఈ విషయంపై డీఎంఆర్‌సీ కానీ, ఇతర అధికారులు కానీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.