రోమ్‍ నగరం తగలబడుతుంటే..పెళ్లిళ్ల కోసం పార్లమెంట్ ఎదుట పెళ్లి కూతుళ్ల నిరసన

రోమ్‍ నగరం తగలబడుతుంటే..పెళ్లిళ్ల కోసం పార్లమెంట్ ఎదుట పెళ్లి కూతుళ్ల నిరసన

రోమ్‍ నగరం తగలబడుతుంటే… నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు .. కరోనా ప్రపంచ దేశాలు అల్లాడుతుంటే.. లాక్ డౌన్ కారణంగా తమపెళ్లిళ్లు ఆగిపోయాయని పెళ్లి కూతుళ్లు రోడ్డెక్కారు. కరోనా వైరస్ ను అరికట్టేందుకు  ఇటలీ యంత్రాంగం పలు ఆంక్షలు విధించి లాక్ డౌన్ ప్రకటించింది. ప్రస్తుతం ఆ లాక్ డౌన్ కొనసాగుతుంది. అయితే లాక్ డౌన్ కారణంగా తమ పెళ్లిళ్లు ఆగిపోయాయని వెంటనే లాక్ డౌన్ ఎత్తివేయాలంటూ వధువులు రోడ్డెక్కారు. ప్లకార్డ్ లతో నిరసన తెలిపారు. ఐకానిక్ ట్రెవి ఫౌంటెన్ వద్ద సరైన ఫ్లాష్ మాబ్ జరిగింది.  అక్కడ 15మంది వధువులు పెళ్లి దుస్తుల్లో ఆంక్షల్ని వ్యతిరేకిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ వల్ల తమపెళ్లిళ్లు ఆగిపోయాయని నిరసన వ్యక్తం చేస్తూ స్లోగన్స్ చేశారు. వివాహాలపై ఆంక్షల్ని ఎత్తి వేయాలని,పెళ్లిళ్లు జరిగేలా నిర్ణయం తీసుకోవాలని ప్లకార్డ్ లలో రాసి అంది. అంతేకాదు ఆంక్షలు విధించి మా పెళ్లిళ్లు ఆగిపోయేలా చేశారని రాసి ఉండడంపై  పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు భవనం ఎదుట కూడా వధువులు నిరసన చేపట్టారు. ఆంక్షల్ని ఎత్తివేయాలని, అలా చేస్తే తమ పెళ్లిళ్లు జరుగుతాయని ప్రభుత్వాన్ని కోరారు.