జిన్నారం, వెలుగు: హైదరాబాద్ లోని ఓ హోటల్ వద్ద జిన్నారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఓ వ్యక్తి నుంచి డబ్బుల ప్యాకెట్తీసుకుంటున్న వీడియో బుధవారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గడ్డపోతారం సర్వే నంబర్ 27లో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను డబ్బులు తీసుకొని ప్రోత్సహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ వీడియో వెలుగులోకి రావడంతో స్థానికులు ఆర్ఐపై మండిపడుతున్నారు. ఘటనపై స్థానికులు తహసీల్దార్ దేవదాస్ ను ప్రశ్నించగా ఆరోపణలపై ఆర్ఐ జయ ప్రకాశ్‌ను వివరణ కోరామని, డిప్యూటీ తహసీల్దార్‌తో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ వీడియో గతంలోనిదా ఇప్పటిదా అనే దానిపై స్పష్టత లేదు. తహసీల్దార్విచారణ నివేదికను ఆర్డీవో, కలెక్టర్ కు పంపిస్తామని తప్పు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
