గుడ్ టచ్ & బ్యాడ్ టచ్.. చిన్నప్పట్నుంచే పిల్లలకు నేర్పించండిలా

గుడ్ టచ్ & బ్యాడ్ టచ్.. చిన్నప్పట్నుంచే పిల్లలకు నేర్పించండిలా

మహిళలు, చిన్న పిల్లలు అని కూడా చూడకుండా ఈ రోజుల్లో లైంగిక వేధింపులు, అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ఈ సమస్య చిన్న పిల్లల్లో మరింత ఆందోళనకు, ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆటలాడుకునే వయసులో అత్యాచారం గురించి తెలియని ఆ పసి పిల్లల శరీరాలతో ఆడుకునే మృగాల వంటి మగాళ్ల నుంచి తప్పించుకునేందుకు తల్లిదండ్రులే మొదటి టీచర్లు కావాలి. లేని తరుణంలో పాఠశాలల్లో టీచర్లయినా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలి. అదే పని చేస్తోంది ఓ టీచర్. తనకొచ్చిన ఈ క్రియేటివ్ ఆలోచన ఎంతో మంది ప్రశంసించేలా చేస్తోంది.

ఈ జనరేషనల్ పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు నేర్పించడం చాలా అవసరం. చిన్నప్పటి నుండే వారిని తమ శరీరంలోని భాగాలను ఎవరు తాకవచ్చు, ఎవరు తాకకూడదు అనే దానిపై అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. ఇది వారు తమను తాము రక్షించుకోవడానికి, లైంగిక వేధింపుల విషయంలో అలర్ట్ గా ఉంచడానికి వీలు కల్పిస్తుంది. ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు చిన్నారులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఎలా అవగాహన కల్పిస్తున్నారో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోనూ హల్‌చల్ చేస్తోంది.

ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ స్టాలిన్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఉపాధ్యాయురాలు మోకాళ్లపై కూర్చోవడంతో ఈ వీడియో స్టార్ట్ అవుతుంది. ఒక విద్యార్థి తరగతి గదిలో ఆమె ముందు నిలబడి ఉన్నారు. క్లిప్ అంతటా, టీచర్ తన శరీరం అంతటా వివిధ రకాల స్పర్శలను ప్రదర్శిస్తుంది. అయితే విద్యార్థి అందులో అది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అని చెప్పడం ఈ వీడియో చూడవచ్చు. ఈ సమయంలో తరగతిలోని విద్యార్థులందరూ వారి వైపే చూడడం కూడా గమనించవచ్చు.

ఈ వీడియోపై ట్విట్టర్ యూజర్స్ స్పందించకుండా ఉండలేకపోయారు. విద్యార్థులలో అవగాహన కల్పించడానికి ఉపాధ్యాయురాలు చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు. "ఇది ప్రతి పిల్లవాడికి బోధించబడాలి, బ్యాడ్ టచ్ గురించి మాట్లాడటం నేర్పించాలి" అని ఒకరు వ్యాఖ్యానించారు. “చిన్న పిల్లలకు మంచి, చెడు టచ్ గురించి బోధించడానికి ఇది చాలా గొప్ప మార్గం. దీన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అమలు చేయాలి" అని మరొకరు సూచించారు. “చాలా చక్కని బోధనా విధానం … ఇది అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా బోధించబడాలి. ఈ ప్రాక్టికల్‌ను గౌరవనీయ (కేంద్ర విద్యా మంత్రి) ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలోని అధికారులు అమలు చేస్తారని ఆశిస్తున్నాను అని ఇంకొకరు ఆశించారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 1మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి.