కుక్కను కారుకు కట్టిన డాక్టర్ పై కేసు నమోదు

కుక్కను కారుకు కట్టిన డాక్టర్ పై కేసు నమోదు

రాజస్థాన్ లో వీధికుక్కను కారుకు కట్టి ఊరంతా తిప్పిన అమానవీయ ఘటన జరిగింది. జోధ్ పూర్ కు చెందిన డాక్టర్ రజనీశ్ గల్వా ఇంటి దగ్గర స్ట్రీట్ డాగ్ ఉంది. దానిని ఊరిబయట వదిలిపెట్టాలనుకున్నాడు డాక్టర్. దీంతో కుక్క మూతిని ఓ తాడుతో కట్టి.. తన కారుతో ఊరంతా తిప్పాడు. కారుతో పాటు పరిగెత్తలేకపోతున్న శునకాన్ని గమనించిన బైకర్.. వెంటనే కారుని ఆపాడు. కుక్క మూతికి ఉన్న తాడు విడిపించారు.

తర్వాత డాగ్ హోం ఫౌండేషన్ సభ్యులకు సమాచారం అందించాడు. వారు శునకాన్ని హోంకు తరలించారు. కాళ్లకు పలుచోట్ల ఫ్రాక్చర్ అయినట్టు డాగ్ హోమ్ ఫౌండేషన్ ట్విట్టర్ లో వెల్లడించింది. ఈ ఘటనపై డాగ్ హోం ఫౌండేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో పోలీసులు డాక్టర్ పై జంతుహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. డాక్టర్  లైసెన్స్ ను రద్దు చేయాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థను, మేనకాగాంధీని  కోరారు.