Sanchita Ugale: ‘ఛావా’నటి సంచిత ఉగాలే మృతి.. 24 గంటల ముందు వరకు ఇన్‌స్టాలో యాక్టివ్.. అసలేమైంది?

Sanchita Ugale: ‘ఛావా’నటి సంచిత ఉగాలే మృతి.. 24 గంటల ముందు వరకు ఇన్‌స్టాలో యాక్టివ్.. అసలేమైంది?

30 ఏళ్ల యువ బాలీవుడ్ నటి సంచిత ఉగాలే సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. ఆమె ఆకస్మిక మరణ వార్త టెలివిజన్ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విక్కీ కౌశల్ నటించిన ఛావా చిత్రంతో మంచి గుర్తింపు పొందిన సంచిత ఉగాలే, ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సంచిత స్నేహితులు, అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

సంచిత మరణానికి గల కారణంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని సోషల్ మీడియా పేజీలు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంటున్నప్పటికీ, ఈ విషయంపై ఇప్పటివరకు కుటుంబ సభ్యులు లేదా అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ క్రమంలోనే ఆమె మరణానికి సంబంధించిన సస్పెన్స్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది.

24 గంటల ముందు వరకు ఇన్‌స్టాలో యాక్టివ్‌..

ఈ విషాదాన్ని మరింత బాధాకరంగా మార్చిన విషయం వెలుగులోకి రావడంతో ఆమె ఫ్యాన్స్ భావోద్వేగానికి గురవుతున్నారు. సంచిత చనిపోయిన వార్త వెలుగులోకి రావడానికి 24 గంటల ముందు వరకు కూడా సంచిత ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంది. ఇటీవల ఆమె షేర్ చేసిన ఓ వీడియోలో 'డఫ్లీ వాలే' పాటకు అద్దం ముందు సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అదే వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మళ్ళీ పోస్ట్ చేయడం మరింత భావోద్వేగానికి గురిచేసింది. అభిమానులు ఆ వీడియోను చూస్తూ ‘మంచి నటిని కోల్పోయాం’ అని ఎమోషనల్ అవుతూ షేర్ చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. 

మిషా సూసైడ్ వార్తలపై సంచిత రియాక్షన్ వైరల్..

 గత ఏడాది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ మరణంపై స్పందించిన సంచిత, సోషల్ మీడియా వ్యసనం మరియు ఆన్‌లైన్ గుర్తింపు కోసం యువత పడుతున్న ఒత్తిడిపై ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇప్పటి యువత తమ జీవితాల గురించి చాలా సులభంగా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరం’ అని ఆమె వ్యాఖ్యానించింది. అయితే, మిషా అగర్వాల్ ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు తెలిస్తేనే సూసైడ్ చేసుకోవడం నేరం అని సంచిత స్పందించింది. అలాంటి అమ్మాయి ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం ఏంటనీ నెటిజన్లలో ప్రశ్నలు లేవనెత్తాయి. 

సంచిత సినిమాలు..

టెలివిజన్ రంగంలో క్రమంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న సంచిత, జీ టీవీలో ప్రసారమైన ప్రముఖ సీరియల్ కుంకుమ్ భాగ్యలో 'దియా టండన్' పాత్రతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ సీరియల్ తన జీవితాన్ని మార్చేసిందని, నటిగా తనకు ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని గతంలో ఆమె చెప్పింది. అలాగే వాగ్లే కి దునియా సీరియల్‌లో 'రుచిత జైట్లే' పాత్రలో కనిపించింది. అనంతరం డంగల్ టీవీ సీరియల్ దిల్‌వాలీ దుల్హా లే జాయేగీలో సోరబ్ బేడీ సరసన 'సుకూన్' ప్రధాన పాత్రలో నటించి మరింత పాపులారిటీ సంపాదించింది.

ఇలా టెలివిజన్‌తో పాటు సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ సంచిత తన ప్రతిభను చాటుకుంది. విక్కీ కౌశల్ నటించిన హిస్టారికల్ ఫిల్మ్ ఛావాలో 'తారా రాణి' చిన్ననాటి పాత్రను పోషించింది. అలాగే మనోజ్ బాజ్‌పేయి నటించిన సైలెన్స్ 2: ది నైట్ అవుల్ బార్ షూటౌట్లో కూడా నటించింది. దీనికి తోడు సంచిత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.