గత వారం చైనా వాయువ్య ప్రాంతంలో భారీ ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియోలో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే, వాయువ్య చైనాలో ఉన్న క్వింగ్‌హై ప్రావిన్స్‌లో చెలరేగిన శక్తివంతమైన దుమ్ము తుపాను తీవ్ర అలజడి సృష్టించింది. నాలుగు గంటల పాటు కొనసాగిన ఇసుక తుపాను... హైక్సీ మంగోల్, టిబెటన్ అటానమస్ ప్రిఫెక్చర్ అనే ప్రదేశాలలో కనిపించింది. అత్యంత కష్టతరమైన ప్రదేశాలలో ఒకటైన ఈ ప్రాంతాల్లో ఏర్పడ్డ ఇసుక తుపాను కారణంగా... నివాసితులు, పర్యాటకుల రాకపోకలను నిలిపివేశారు. అదృష్టవశాత్తూ దీని వల్లఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాల మాదిరిగానే చైనా కూడా తీవ్రమైన వేడితో పోరాడుతోంది. AccuWeather ప్రకారం, జూన్ మధ్య నుండి, ఉత్తర, తూర్పు, మధ్య చైనాలోని వివిధ ప్రదేశాలు అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నాయి. రాబోయే రోజుల్లో చైనాలోని కొన్ని ప్రాంతాలలో వేడి నుండి ఉపశమనం కలగవచ్చని నిపుణులు ఆశిస్తున్నారు.
Footage of a sandstorm in China's Qinghai province is spreading on social media. pic.twitter.com/Qeg3jxwWl3
— Spriteer (@spriteer_774400) July 22, 2022
Dramatic video of a massive sandstorm ripping through China's Qinghai province has emerged on social media | WATCH #ITReel #China #Sandstorm #Qinghai #Twitter #nature pic.twitter.com/pv4NWgCW4g
— Rasmus (@notorius_vip) July 24, 2022
