నోయిడాలోనే అతి పెద్ద షాపింగ్ మాల్.. మంటలతో పొగలు కమ్మేశాయి

నోయిడాలోనే అతి పెద్ద షాపింగ్ మాల్.. మంటలతో పొగలు కమ్మేశాయి

ఢిల్లీ శివార్లలోని నోయిడాలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ అది.. లాజిక్స్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ వెంటనే మాల్ మొత్తం పొగ వ్యాపించింది. ఎదుటి వాళ్లు కనిపించనంతగా కమ్మేసింది పొగ.. ఫైర్ అలారమ్స్ మోగటంతో.. షాపింగ్ మాల్ లోని సిబ్బంది.. కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. ఉదయం సమయం కావటంతో కస్టమర్లు పెద్దగా లేరు.. దీంతో అతి పెద్ద ప్రమాదం తప్పింది అంటున్నారు సిబ్బంది.

2024, జూలై 5వ తేదీ శుక్రవారం ఉదయం నోయిడాలో లాజిక్స్ మాల్‌లోని ఓ బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మాల్ సిబ్బంది సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పలు ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మాల్ సిబ్బందిని భవనం నుండి ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని ఫైర్ అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో మాల్ లోపల పొగతో నిండిన కారిడార్‌లను కనిపిస్తోంది. అయితే.. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం, ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.