జంతువులను వేటాడుతూ వీడియోలు.. కపుల్​కు కోటి ఫైన్

జంతువులను వేటాడుతూ వీడియోలు.. కపుల్​కు కోటి ఫైన్
  • కపుల్​కు కోటి ఫైన్
  • అమెరికా కోర్టు తీర్పు 

వాషింగ్టన్: జంతువులను వేటాడుతూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్న భార్యాభర్తలకు అమెరికాలోని కోర్టు రూ.కోటి జరిమానా విధించింది. జోష్(32), సారా బౌమర్(33) భార్యాభర్తలు. వీళ్లు బౌమర్ బౌహంటింగ్ అనే యూట్యూబ్ చానెల్ నడిపిస్తున్నారు. జంతువులను వేటాడుతూ, ఆ వీడియోలను ఇందులో పోస్టు చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లోనూ వీడియోలు పెడుతున్నారు.

వీటిని లక్షలాది మంది చూస్తున్నారు. రూల్స్ ఉల్లంఘించి హంటింగ్ చేస్తున్నారని, అక్రమంగా జంతువుల అమ్మకం, రవాణా చేస్తున్నారని వీళ్లపై కేసు నమోదైంది. 2015 నుంచి 2017 మధ్య ఈ జంట దాదాపు 100 జంతువులను చంపినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. మొత్తం 39 మందిని దోషులుగా తేల్చిన నెబ్రస్కా కోర్టు జోష్, సారాకు రూ.1.08 కోట్ల జరిమానా విధించింది.