వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకునే విజయ్ ఆంటోనీ.. ఈసారి ‘హిట్లర్’ అనే యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ధన దీనికి దర్శకుడు. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘మనం యుద్ధానికి వాడబోయే ఆయుధాన్ని నిర్ణయించేది మన శత్రువే’ అనే లైన్‌తో టీజర్ మొదలైంది. డిక్టేటర్ లాంటి పొలిటీషియన్.
అతన్ని వేటాడే ఓ కిల్లర్. తనని పట్టుకునే పనిలో పోలీస్ ఆఫీసర్. ఈ మూడు పాత్రల మధ్య జరిగే కథ ఇదని టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. కిల్లర్‌గా విజయ్ లుక్, క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంది. రియా సుమన్ తనకు జంటగా కనిపించింది. పొలిటీషియన్‌గా చరణ్ రాజ్, పోలీస్‌గా గౌతమ్ మీనన్ నటించారు. నియంతలా వ్యవహరించే ఓ రాజకీయ నేతను ఎదుర్కొనే సాధారణ పౌరుడి కథే ఈ సినిమా అంటున్నారు మేకర్స్. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.
