విజయ్ ఆంటోనీ తుఫాన్‌‌‌‌‌‌‌‌ చిత్రం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

విజయ్ ఆంటోనీ తుఫాన్‌‌‌‌‌‌‌‌ చిత్రం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

 విజయ్ ఆంటోనీ హీరోగా విజయ్ మిల్టన్ తెరకెక్కించిన చిత్రం ‘తుఫాన్‌‌‌‌‌‌‌‌’. శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శనివారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఎవరి గతంలో లేని, మరొకరి భవిష్యత్తుగా మారిన ఓ వ్యక్తి కథ ఇదని ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెప్పారు. 

తనకు ఎవరూ తెలియని ఓ ప్రాంతంలోకి వెళ్లి ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్తపడుతుంటాడు విజయ్ ఆంటోనీ. అతన్ని తన చీఫ్ శరత్ కుమార్ గైడ్ చేస్తుంటాడు. అతని గతమేంటి, పోలీసులు అతని కోసం ఎందుకు వెదుకుతున్నారు అనే ఇంటరెస్టింగ్‌‌‌‌‌‌‌‌ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తో సాగిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. జులైలో సినిమా రిలీజ్ కానుంది.