'బిచ్చగాడు' మూవీతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ స్టార్ విజయ్ ఆంటోని. కమర్షియల్ హంగుల కంటే కంటెంట్‌నే నమ్ముకునే ఆయన, మరోసారి బాక్సాఫీస్‌ను ఎమోషనల్‌గా షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. బ్లాక్‌బస్టర్ 'బిచ్చగాడు' కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. సెన్సేషనల్ డైరెక్టర్ శశి దర్శకత్వంలో విజయ్ ఆంటోని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'వంద దేవుళ్లు'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ రోజు ( జూన్ 8న ) ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
ఈసారి రైతు సెంటిమెంట్‌తో..
పూనకాలు తెప్పించే మాస్ సినిమాల మధ్య, గుండెల్ని పిండేసే ఎమోషన్లతో రాబోతోంది 'వంద దేవుళ్లు'. ఈ లోకంలో ప్రాణాలతో పుట్టిన అందరికీ కనీస అవసరాలుంటాయి.. తినడం, నిద్రపోవడం, తోడు వెతుక్కోవడం. అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. 'బిచ్చగాడు' తరహాలోనే ఇందులోనూ హృదయాలను కదిలించే అమ్మ సెంటిమెంట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
►ALSO READ | 'వాన పడితే కాకుల్లా దాక్కునే జీవితాలు మావి'.. పూరి - విజయ్ సేతుపతి 'స్లమ్‌డాగ్' టీజర్ రిలీజ్!
దీనికి తోడు మన సమాజానికి వెన్నెముక అయిన రైతు సమస్యల చుట్టూ ఈ కథ తిరగబోతున్నట్లు ట్రైలర్ హింట్ ఇచ్చింది. ఒక మధ్యతరగతి కుటుంబం పడే ఆరాటం, భార్యాభర్తల బంధం, ప్రేమికుల మధ్య అనుబంధం.. ఇలా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే అన్ని ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ ఆంటోని సరసన స్వాసిక హీరోయిన్‌గా నటిస్తుంది. అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, మునిష్ కాంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలాజీ శ్రీరామ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రాణం పోసింది.
జూన్ 19న థియేటర్లలో సందడి!
విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్, రామాంజనేయులు జవ్వాజి ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంది. సామాజిక సందేశంతో పాటు కన్నీళ్లు పెట్టించే ఎమోషన్స్ ఉన్న ఈ 'వంద దేవుళ్లు' చిత్రం జూన్ 19న భారీ అంచనాలతో థియేటర్లలోకి రానుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
