
హైదరాబాద్, వెలుగు: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాకు (ఏసీఏఐ) సదరన్ ఇండియా రీజినల్ కౌన్సిల్ చైర్మన్‌గా విజయ్ కిరణ్ అగస్త్య ఎన్నికయ్యారు. ఈయన 2025– 26 సంవత్సరానికి చైర్మన్‌గా విధులు నిర్వహించనున్నారు. డెలాయిట్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పని చేసిన ఆయన నాలుగేళ్ల క్రితం ఎంట్రపెన్యూర్గా మారారు.
ప్రస్తుతం కెరీర్ గైడెన్స్, స్కిల్ డెవలప్‌మెంట్ పై దృష్టి పెట్టారు. ఎడ్టెక్ స్టార్టప్ 'మెంటార్‌మీ'కు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. నూతన కార్యవర్గ సభ్యులను కూడా ఈ సందర్భంగా ఎన్నుకున్నామని ఏసీఏఐ తెలిపింది.