
విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ మూవీ పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తోంది. శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో.. సక్సెస్ ను టీమ్ ఎంజాయ్ చేస్తున్న క్రమంలో పైరసీ షాక్ ఇచ్చింది. డియర్ కామ్రేడ్ థియేటర్లలో షోలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే.. సినిమాను HD రిజల్యూషన్ తో క్వాలిటీ పైరసీ ప్రింట్ ను తమిళ రాకర్స్ వెబ్ సైట్ లో లీక్ చేశారు. వీరికి పలు అంతర్జాతీయ పైరసీ ముఠాలతో సంబంధాలు ఉండటంతో ఈజీగా పైరసీకి పాల్పడుతున్నారు. తమిళ్ రాకర్స్ . కామ్ తరచూ డొమెయిన్ పేర్లు మార్చుకుంటూ సైబర్ నేరాలకు పాల్పడుతోంది.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల అయిన ఈ సినిమాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో కన్నడ వర్షన్ కన్నా తెలుగు వర్షన్‌కే ఎక్కువగా థియేటర్లు కేటాయించటంపై ప్రేక్షకులు సీరియస్ అవుతున్నారు. ఇప్పుడు సినిమా లీక్ కావడంతో సినిమా యూనిట్ ఆందోళనలో పడింది.