రివ్యూ: డియర్ కామ్రేడ్

రివ్యూ: డియర్ కామ్రేడ్

రివ్యూ: డియర్ కామ్రేడ్

రన్ టైమ్: 2 గంటల 50 నిమిషాలు

నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక, సుహాస్, శ్రీకాంత్ ఆచార్య తదితరులు

సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్

మ్యూజిక్: జస్టిన్ ప్రభాకరణ్

నిర్మాతలు: మైత్రీ మూవీస్, బిగ్ బెన్ సినిమాస్

రచన,దర్శకత్వం: భరత్ కమ్మ

రిలీజ్ డేట్: జులై 26,2019

స్టోరీ..?

బాబీ (విజయ్ దేవరకొండ) కాకినాడలో చదువుకుంటుంటాడు.. స్టూడెంట్స్ తరపున పోరాడుతుంటాడు. వాళ్ల పక్కింట్లోని పెళ్లి కోసం వచ్చిన లిల్లీ (రష్మిక)ను చూసి లవ్ లో పడతాడు. ఆమెకు ఇతను చేసే గొడవలు నచ్చవు. అందుకే ఓ సారి పెద్ద గొడవ జరిగినప్పుడు ఇద్దరు విడిపోతారు. తర్వాత వీళ్ల జర్నీ ఎలా సాగింది. మళ్లీ ఎలాంటి సందర్భంలో కలిసారు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సింది.

నటీనటుల పర్ఫార్మెన్స్:

విజయ దేవరకొండ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు. బాబీ పాత్రలో లవర్ గా, ఫైటర్ గా అన్ని ఎమోషన్స్ బాగా పండించి సినిమాకు మేజర్ ప్లస్ అయ్యాడు. రష్మికకు మంచి క్యారెక్టర్ దక్కింది. నటనతో కూడా మెప్పించింది. క్లైమాక్స్ లో చాలా బాగా ఎమోషన్ పండించింది. హీరో ఫ్రెండ్స్ అందరూ బాగా చేశారు.

టెక్నికల్ వర్క్:

సినిమా కు టెక్నికల్ టీమ్ నుండి మంచి ఔట్ పుట్ లభించింది. జస్టిన్ ప్రభాకరణ్ మ్యూజిక్ ఫ్రెష్ గా ఉంది. పాటలన్నీ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ సినిమా మూడ్ కు తగినట్టు బాగుంది. సుజిత్ సారంగ్ విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉండాల్సింది. సెకండాఫ్ లో కొన్ని సీన్లకు కత్తెర పడాల్సింది. ఆర్ట్ వర్క్, యాక్షన్ సీన్లు అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. డైలాగులు బాగున్నాయి.

విశ్లేషణ:

‘‘డియర్ కామ్రేడ్’’ స్పెషల్ ట్రీట్  మెంట్ తో కూడిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ. అంతర్లీనంగా ఓ మెసేజ్ కూడా ఉంది. డిఫరెంట్ టోన్ లో మొదలైన మూవీ మెల్లగా బాబీ, లిల్లీల స్టోరీలో నిమగ్నమవుతాం. కొంచం స్లోగా అనిపించినా..ఫస్టాఫ్ బాగానే సాగుతుంది. ఇంటర్వల్ దగ్గర బ్రేకప్ అయిన తర్వాత దగ్గర నుంచి కథకు బ్రేకులు పడతాయి. ముందుకు సాగకుండా మొరాయిస్తుంది. కొన్ని అనసరమైన సీన్లు బోర్ కొట్టస్తాయి. కొన్ని సార్లు అసలు కథ ఎటువైపు వెళ్తుందో అర్థం కాదు. డైరెక్టర్ రాసుకున్న పాయింట్ మంచిదే అయినా.. స్క్రీన్ ప్లే ప్రజెంట్ చేయడంలో విఫలమయ్యాడు.

సెకండాఫ్ లో అనుకున్న పాయింట్ ను డీల్ చేయడంలో అనుభవ లేమి కనిపించింది. అయితే డైరెక్టర్ ఫెయిలయిన చోట్ల హీరో విజయ్ దేవరకొండ సీన్లను చాలా వరకు నిలబెట్టాడు. విజయ్ ను స్క్రీన్ పై చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. అంత ప్లజెంట్ గా ఉంది అతని నటన. ఓవరాల్ గా సినిమాను ఎంటర్ టైన్మెంట్ గా భావించే వాళ్లకు డియర్ కామ్రేడ్ నచ్చక పోవచ్చు కానీ.. రెగ్యులర్ సినిమాల మీద కంప్లైంట్ చేసే జనాలకు మాత్రం నచ్చే అవకాశాలున్నాయి. నటీనటుల మధ్య కెమిస్ట్రీ, మ్యూజిక్, విజువల్స్ లాంటి పాయింట్స్ సినిమాకు హైలైట్స్.