KINGDOM OTT: అఫీషియల్.. ఓటీటీలోకి ‘కింగ్‌డమ్‌’.. నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

KINGDOM OTT: అఫీషియల్.. ఓటీటీలోకి ‘కింగ్‌డమ్‌’.. నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్‌’ ఓటీటీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ (ఆగస్ట్ 25న) కింగ్‌డమ్‌ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్.

జూలై 31,2025న విడుదలైన కింగ్‌డమ్‌ ఆగస్ట్ 27 నుంచి స్ట్రీమింగ్కి రానున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

ఈ గ్యాంగ్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్ను నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.53 కోట్లకు కొనుగోలు చేసింది. దీని వలన నిర్మాతలు పెట్టిన బడ్జెట్‌లో సగం తిరిగి పొందారు. అయితే, నెలరోజుల్లోపే ‘కింగ్‌డమ్‌’ ఓటీటీలోకి రావడం ఆశ్చర్యంగా ఉంది.

ఇదిలా ఉంటే.. సితారా ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సినిమాను నిర్మించారు. రూ.130 కోట్ల బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కింది.

►ALSO READ | Inspector Zende: నెట్‌ఫ్లిక్స్’లోకి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్‌ థ్రిల్లర్‌.. ఉత్కంఠగా ‘ఇన్‌స్పెక్టర్‌ జెండె’ట్రైలర్‌

కింగ్‌డమ్ లాంగ్ రన్లో ఇండియాలో రూ.51 కోట్లకి పైగా నెట్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల లోపు గ్రాస్ వసూళ్లు చేసినట్లు సినీ వర్గాల టాక్. అయితే, మేకర్స్ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. చివరగా మేకర్స్.. 4 రోజుల్లో రూ.82 కోట్ల గ్రాస్ అని వెల్లడించారు.