
మనోజ్ బాజ్‌పాయీ (Manoj Bajpayee)..ఈ పేరుకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్లో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న మనోజ్.. తన సినిమాలతో ఆడియన్స్కు బాగా దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఆయన ప్రధాన పాత్రల్లో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో మనోజ్ నటించే సినిమాలపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్.
లేటెస్ట్గా మనోజ్ ‘ఇన్‌స్పెక్టర్ జెండె’(Inspector Zende) అనే ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తున్నాడు. సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను పట్టుకున్న పోలీసు అధికారి (మధుకర్ జెండే) జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఇవాళ ఆగస్ట్ 25న మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఉత్కంఠగా సాగింది.
ఇన్‌స్పెక్టర్ జెండే పాత్రలో నటించిన మనోజ్ బాజ్‌పాయీ పాత్ర ఆసక్తి కలిగిస్తోంది. అలాగే, ఇందులో మరో స్పెషల్ రోల్ చేసిన కుబేర విలన్ 'జిమ్ సర్బ్' క్యారెక్టర్ కొత్తగా ఉంది. ఆయన ఓ అంతుచిక్కని 'స్విమ్‌సూట్ కిల్లర్' పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను చిన్మయ్ మాండ్లేకర్ తెరకెక్కించగా, జే శేవక్రమణి మరియు ఓం రౌత్ నిర్మించారు. అయితే, ఈ మూవీ థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తుంది. సెప్టెంబరు 5 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది.
►ALSO READ | OTTలోకి రజనీకాంత్ 'కూలీ' .. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ‘రియల్ హీరో ఇన్‌స్పెక్టర్ జెండే’గురించి మనోజ్ మాట్లాడారు. ‘‘ఇన్‌స్పెక్టర్ జెండేలో నన్ను ఆకర్షించిన విషయం ఏమిటంటే, అతను పేరు, ప్రఖ్యాతల కోసం సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ను వెంబడించడం లేదు. కేవలం తన పనిని నిజాయితీగా, నిబద్ధతగా నిర్వర్తించాడు. రెండుసార్లు అత్యంత డేంజరస్ క్రిమినల్స్లో ఒకరైన చార్లెస్ శోభరాజ్ని ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడు.
అతని ధైర్యం, తనలోని హాస్యం మరియు క్లారిటీగా ఉండే మైండ్ సెట్.. ఇవన్నీ నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. అతనిని కలవడం జీవితాంతం చెప్పుకోదగ్గ కథలతో కూడిన కథల పుస్తకంలోకి అడుగుపెట్టినట్లు అనిపించిందని’’మనోజ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.