
సూపర్ స్టార్ రజనీకాంత్ , యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన తొలి చిత్రం ' కూలీ ' . ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడులైంది. ఇదే రోజు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ , టాలీవుడ్ యంగ్ టైగర్ కలిసి నటించిన ' వార్ 2 ' థియేటర్లలోకి వచ్చి గట్టి పోటీ ఇచ్చింది. అయినా 'కూలీ' ఆ పోటీని తట్టుకుని బాక్సాఫీస్ వద్ద నిలబడింది. థియేటర్లతో కలెక్షన్ల సునామీ సృష్టించింది.
' కూలీ' మూవీకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. ఈ యాక్షన్ థ్రిల్లర్ తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది. విడుదలైన రెండువారాల్లోనే భారతదేశంలో రూ. 250 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 468 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇది బాలీవుడ్ చిత్రాలైన "టైగర్ 3" రూ. 464 కోట్లు , షారుఖ్ ఖాన్ "డంకీ" రూ. 454 కోట్లు జీవితకాల వసూళ్లను అధిగమించి, 2025లో మూడవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
"వార్ 2" ఊహించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ప్రస్తుతం రూ. 300 కోట్ల క్లబ్‌లో ఉంది. కానీ 'కూలీ' కలెక్షన్లు మాత్రం కాస్త స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రూ. 468 కోట్ల పై వసూలు చేసిన ఈ చిత్రం త్వరలోనే రూ. 500 కోట్ల మార్కును చేరుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మూవీ OTTలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
►ALSO READ | ParineetiChopra: 2023లో ఎంపీతో పెళ్లి.. తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన స్టార్ హీరోయిన్
రజనీకాంత్ "కూలీ" మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ సినిమా థియేట్రికల్ విడుదల తర్వాత 6 నుంచి 8 వారాల మధ్య ఓటీటీలోకి వస్తుందని అంచనా. దాని ప్రకారం, సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 మధ్య ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు అమీర్ ఖాన్, నాగార్జున, సౌబిన్ షాహిర్, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, రచితా రామ్, కాళీ వెంకట్, కన్నా రవి వంటి భారీ తారాగణం నటించింది. ఇందులో నాగార్జున విలన్‌గా నటించడం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. రజనీకాంత్ అభిమానులతో పాటు, యాక్షన్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఒక పండగ లాంటి అనుభవాన్ని అందిస్తుంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో ఈ విజువల్ ట్రీట్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి.