దటీజ్​ విజయ్​

దటీజ్​ విజయ్​

‘లైగర్‌‌‌‌‌‌‌‌’ సినిమా కోసం రెండేళ్ల పాటు పూరి జగన్నాథ్‌‌‌‌తో లాంగ్ జర్నీ చేశాడు విజయ్ దేవరకొండ. ఎట్టకేలకు షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ‘లైగర్‌‌‌‌‌‌‌‌’ షూట్ పూర్తవగానే పూరి డైరెక్షన్‌‌‌‌లోనే ‘జనగణమన’ చిత్రాన్ని స్టార్ట్ చేసిన విజయ్.. ఈ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ కూడా అయ్యాడు. షూట్ గ్యాప్‌‌‌‌లో దొరికిన టైమ్‌‌‌‌ని ఎంజాయ్‌‌‌‌ చేస్తూ రీఫ్రెష్‌‌‌‌ అవుతున్నాడు. పచ్చని చెట్ల మధ్య కూల్‌‌‌‌గా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ‘లాంగ్ వాక్స్‌‌‌‌’ అంటూ ఇందుకు సంబంధించిన ఓ వీడియోని కూడా ట్వీట్ చేశాడు. ఇలా తన పర్సనల్ ట్రిప్స్, ఫిల్మీ అప్‌‌‌‌డేట్స్‌‌‌‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అతని క్రేజ్ ఎంత పెరిగిపోయిందంటే.. ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో 15 మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌‌‌‌ను క్రాస్ చేశాడు. చాలామంది స్టార్‌‌‌‌‌‌‌‌ హీరోల ఫాలోయింగ్ కంటే ఇది ఎక్కువ. అతి తక్కువ సమయంలోనే ఈ రేంజ్‌‌‌‌లో అభిమానాన్ని సంపాదించుకోవడం విజయ్‌‌‌‌కే చెల్లింది. ఇక ‘మజిలీ’ ఫేమ్‌‌‌‌ శివ నిర్వాణ డైరెక్షన్‌‌‌‌లో అతను నటించాల్సి ఉంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌‌‌‌కి వెళ్తుందని, ఈ రొమాంటిక్ లవ్‌‌‌‌స్టోరీలో విజయ్‌‌‌‌కి జోడీగా సమంత నటించనుందని సమాచారం.