ఇవాళ మే9న విజయ్ దేవరకొండ తన 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సెలబ్రెటీలు, అభిమానులు విజయ్కు విషెస్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం విజయ్ నటిస్తున్న “రౌడీ జనార్దన’’నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది.
“ప్రపంచంతో పోరాడే వ్యక్తి.. కేవలం ప్రేమకు మాత్రమే లొంగిపోతాడు’ అంటూ విజయ్ పాత్ర స్వభావాన్ని పరిచయం చేసిన తీరు ఆసక్తి కలిగిస్తుంది. ఇందులో విజయ్ గుండెలపై కీర్తి సురేష్ కాలు పెట్టడం.. విజయ్ అరవోకగా చిందించే చిరునవ్వు క్యూరియాసిటీ పెంచుతోన్నాయి.
A man who fights the world…
— Sri Venkateswara Creations (@SVC_official) May 9, 2026
but surrenders only to love ❤️
Wishing our #RowdyJanardhana @TheDeverakonda a very Happy Birthday 🔥#HBDVijayDeverakonda@keerthyofficial @storytellerkola @christoxavier_ #AnendCChandran @DinoShankar @PraveenRaja_Off @SVC_official @Tseries… pic.twitter.com/FVIWVYQ0UH
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. 1980ల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ తొలిసారి తూర్పుగోదావరి యాసలో, పూర్తి మాస్ పాత్రలో కనిపించనున్నారు. రాజావారు రాణివారితో మంచి ఫేమ్ పొందిన రవి కిరణ్ కోలా సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే రౌడీ జనార్దన గ్లింప్స్ భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్తో “రణబాలి” మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, “ఏందయ్యా సామీ” పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ చిత్రంలో విజయ్-రష్మిక జోడీ మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. సెప్టెంబర్ 11న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
