KINGDOM: అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘కింగ్‌డమ్’ దూకుడు.. విజయ్ సక్సెస్ను ఆపడం ఎవరితరం కాదు!

KINGDOM: అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘కింగ్‌డమ్’ దూకుడు.. విజయ్ సక్సెస్ను ఆపడం ఎవరితరం కాదు!

విజయ్ దేవరకొండ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్‌డమ్’(KINGDOM).ఈ మూవీ భారీ అంచనాలతో రేపు (జూలై 31న) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో కింగ్‌డమ్ అడ్వాన్స్ బుకింగ్స్లో దుమ్మురేపుతోంది. ఇప్పటికే, మూవీ టికెట్ ప్లాట్ఫామ్స్లో ఒకటైన బుక్ మై షోలో (BookMyShow) లక్ష టిక్కెట్లు అమ్ముడయ్యాయి.

ఈ సందర్భంగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసి కింగ్‌డమ్ సత్తా ఏంటో చెప్పుకొచ్చారు. ‘బాక్సాఫీస్ వద్ద అద్వితీయమైన రీతిలో కింగ్‌డమ్ దూసుకుపోతోంది. BookMyShowలో కింగ్‌డమ్ ఇప్పటికే 100K+టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అంతేకాకుండా ప్రతి మూల, మూలలో విజయ్ మానియా భారీగా ఉంది. బుకింగ్స్ జోరు కంటిన్యూ  అవుతుంది..’అని మేకర్స్ తెలిపారు.

తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్స్ లేకపోయినప్పటికీ ఈ శైలిలో బుకింగ్స్ అవ్వడం కింగ్‌డమ్ సక్సెస్ ఏంటో తెలుస్తోంది. మరోవైపు, USAలో ఇవాళ (జులై30న) ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తుండగా, ఇప్పటికే 20 వేల టిక్కెట్లు అమ్ముడయినట్లు మేకర్స్ వెల్లడించారు. కెనడాలో 1534 లకు పైగా టికెట్స్ సేల్ అయ్యాయి.

అలాగే, మిగతా చోట్లలో కూడా ఇదే జోరు కొనసాగుతుంది. ఈ టికెట్ల బుకింగ్స్ బట్టి చూస్తే.. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన విజయ్ దేవరకొండ ఖాతాలో భారీ హిట్ పడటం కన్ఫార్మ్ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

►ALSO READ | రవితేజ మాస్ జాతర డబ్బింగ్ షురూ.. వినాయక చవితికి థియేటర్లోకి

వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో వరుస డిజాస్టర్స్ అందుకున్నారు విజయ్. ఈ క్రమంలో ‘కింగ్‌డమ్’హిట్ అవ్వడం విజయ్కి ఖచ్చితమైన అవసరం. అయితే, టీజర్, ట్రైలర్, సాంగ్స్తో ఆడియన్స్లో కింగ్‌డమ్ భారీ ఇంపాక్ట్ తీసుకొచ్చింది. ఇక పాజిటివ్ టాక్ అందుకుంటే.. విజయ్ సక్సెస్ను ఆపడం ఎవరితరం కాదు. 

‘కింగ్‌డమ్’సినిమాకు సెన్సార్ పూర్తై U/Aసర్టిఫికెట్ పొందింది.‘జెర్సీ’డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో సినిమా అంటే ఎలా ఉంటుందో ఆడియన్స్కు బాగా తెలుసు. హీరో నానితో క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో జెర్సీ తీసి భారీ విజయాన్ని అందుకున్నారు.

ఇప్పటివరకు ఈ సినిమా అనేక అవార్డులు గెలుచుకుంది. ఇందులో ఒక్కో సాంగ్, ఒక్కో సీన్ చార్ట్ బ్లాస్టర్. ఈ క్రమంలో విజయ్తో  ‘కింగ్‌డమ్’లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్తో వస్తుండటం సినిమాపై హైప్ నెక్స్ట్ లెవల్లో క్రియేట్ అయ్యింది. మరికొన్ని గంటల్లో ‘కింగ్‌డమ్’మేనియా ఏంటనేది తెలిసిపోతుంది.