మారేడుకోనలో అన్వేషి

మారేడుకోనలో అన్వేషి

విజయ్ ధరణ్, సిమ్రాన్ గుప్తా, అన‌‌‌‌న్య నాగ‌‌‌‌ళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘అన్వేషి’.  వి.జె.ఖ‌‌‌‌న్నా ద‌‌‌‌ర్శక‌‌‌‌త్వంలో టి.గ‌‌‌‌ణ‌‌‌‌ప‌‌‌‌తి రెడ్డి నిర్మిస్తున్నారు. న‌‌‌‌వంబ‌‌‌‌ర్ 10న సినిమా విడుదలవుతోంది. సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. హీరో విజయ్ ధరణ్ మాట్లాడుతూ ‘అవుట్‌‌‌‌పుట్ చాలా బాగా వచ్చింది. ఇప్పటివ‌‌‌‌ర‌‌‌‌కు విడుద‌‌‌‌లైన టీజర్, సాంగ్స్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వ‌‌‌‌చ్చింది.

సినిమాను చూసి ఎవరైనా బాగోలేద‌‌‌‌ని అంటే గుండు గీయించుకుంటాను’ అని అన్నాడు. సినిమా సక్సెస్‌‌‌‌పై నమ్మకంగా ఉన్నామన్నారు హీరోయిన్స్ సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల. ‘మారేడుకోన బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కించాం. నవంబర్ రెండో వారంలో రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నాం’ అని దర్శక నిర్మాతలు చెప్పారు.  మ్యూజిక్ డైరెక్టర్ చైత‌‌‌‌న్ భ‌‌‌‌రద్వాజ్, నటుడు నాగి, లిరిసిస్ట్ చైత‌‌‌‌న్య ప్రసాద్, కో ప్రొడ్యూస‌‌‌‌ర్స్ హ‌‌‌‌రీష్ రాజు, శివన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.