ఆర్మీ హౌస్లో విజయ్ దివస్ వేడుకలు

ఆర్మీ హౌస్లో విజయ్ దివస్ వేడుకలు

ఢిల్లీలోని  ఆర్మీ హౌస్‌లో విజయ్ దివస్ 2022 వేడుకలు ఘనంగా జరిగాయి. 1971 బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయాన్ని  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు సెలబ్రేట్ చేసుకున్నారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ పర్యవేక్షణలో జరిగిన విజయ్ దివస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో  సైనికాధికారులు పాల్గొన్నారు. పాక్ పై దేశం సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ ప్రతీ ఏడాది డిసెంబర్ 16న  విజయ్ దివస్ పేరుతో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. 

విజయ్ దివస్ సందర్భంగా ఆర్మీహౌస్ ఆవరణలో ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. పాక్ పై భారత్ సాధించిన విజయాన్ని వీడియో ప్రదర్శన ద్వారా వివరించారు. సరిగ్గా 51 ఏళ్ల  క్రితం  పాకిస్తాన్ సైన్యం నుండి 93వేల మంది సైనికులు తమ ఆయుధాలను భారత్ కు లొంగిపోయారు.  ఫలితంగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించింది. 1971  డిసెంబర్ 16న  లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ, తూర్పు పాకిస్తాన్ యొక్క చీఫ్ మార్షల్ లా అడ్మినిస్ట్రేటర్ ,తూర్పు పాకిస్తాన్‌లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ ఈ లొంగుబాటు సాధనంపై సంతకం చేశారు. ఈ సన్నివేశాలన్నీ ఆర్మీ హౌస్ లో ప్రదర్శన చేశారు.