రామ్ చరణ్ కి థాంక్స్ చెప్తున్న విజయ్ ఫ్యాన్స్

రామ్ చరణ్ కి థాంక్స్ చెప్తున్న విజయ్ ఫ్యాన్స్

మే 9న టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంటంతో ఆయనకు ప్రేక్షకులు, అభిమానులతో పాటు సినీ ప్రముఖులు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాదు.. ది విజయ్ దేవరకొండ అనే హ్యాష్ ట్యాగ్‌తో అభిమానులు ఈ హీరోను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. అటు విజయ్ కూడా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడు.

ఇక హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతితక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్, ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. దీంతో స్టార్ హీరోలతో సమానంగా ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు కూడా ఆయనకు తమ విషెస్ చెబుతున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా విజయ్ కు బర్త్‌డే విషెస్ తెలిపాడు. ట్విట్టర్ వేదికగా విజయ్ కు విషెస్ చెబుతూ గ్రీట్ చేశాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా విజయ్ అభిమానులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేయడాన్ని ప్రస్తావించాడు. విజయ్ బర్త్ డి సందర్భంగా తన ఫ్యాన్స్ రక్తదానం చేయడం నిజంగా అభినందనీయం అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు చరణ్.

ఈ ట్వీట్‌కు విజయ్ ‘థ్యాంక్యు అన్నా.. వారు ఎల్లప్పుడే నన్ను సంతోషపెట్టడమే కాకుండా గర్వించేలా చేస్తున్నారు..’’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోలు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్, తమిళ డైరెక్టర్ శంకర్ తో "గేమ్ ఛేంజర్" మూవీ చేస్తున్నాడు. ఇక విజయ్ దేవరకొండ, సమంత హీరోయిన్‌గా ‘ఖుషి’ మూవీ చేస్తున్నాడు.

https://twitter.com/AlwaysRamCharan/status/1655843361675448321