
బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి పరారైన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ లో చేదు అనుభవం ఎదురైంది. నిన్న ఓవల్ గ్రౌండ్ లో జరిగిన భారత్, ఆసిస్ మ్యాచ్ చూశారు మాల్యా. మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియం నుంచి విజయ్ మాల్యా బయటికి వస్తుండగా.. ప్రేక్షకులు అతన్ని చుట్టుముట్టారు. మాల్యా చోర్ అంటూ నినాదాలు చేశారు. మోడీకి అనుకూలంగా స్లోగన్ ఇచ్చారు. దీంతో షాకయ్యారు విజయ్ మాల్యా. పోలీసులు అతన్ని అక్కడినుంచి తరలించారు.
మాల్యాను భారత్ కు రప్పించడానికి ప్రయత్నిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ కేసు ప్రస్తుతం లండన్ కోర్టులో నడుస్తుంది. ఇదిలాఉంటే.. మాల్యా స్టేడియంలోకి వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న ఒక భారత రిపోర్టర్ ‘అప్పగింత’ కేసు గురించి అడగగా.. తాను మ్యాచ్ ను చూడటానికి మాత్రమే వచ్చానని చెప్పారు.
#WATCH London, England: Vijay Mallya says, "I am making sure my mother doesn't get hurt", as crowd shouts "Chor hai" while he leaves from the Oval after the match between India and Australia. pic.twitter.com/ft1nTm5m0i
— ANI (@ANI) June 9, 2019