G.O.A.T Release Date: తలపతి ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. GOAT రిలీజ్ డేట్ వచ్చేసింది

G.O.A.T Release Date: తలపతి ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. GOAT రిలీజ్ డేట్ వచ్చేసింది

తమిళ స్టార్ హీరో విజయ్(Vijay) ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభు(Venkat Prabhu)తో G.O.A.T(Greatest Of All Time) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసందే. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో విజయ్ తండ్రి కొడుకులుగా కనిపించనున్నాడని టాక్. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. 

తాజాగా విజయ్ అభిమానుల ఎదురుచూపులకుక్ ఎండ్ కార్డు వేస్తూ.. G.O.A.T సినిమా రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమాను సెప్టెంబర్ 5న వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి కారణంగా వరుస సెలవులు కలిసి వచ్చేలా G.O.A.T సినిమా రిలీజ్ సెట్ చేశారు మేకర్స్. దీంతో ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.

ఇక విజయ్ గత చిత్రం లియో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు వస్తున్న G.O.A.T మూవీ అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని అంచనా. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాదిస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.