ఆయనో లెజెండ్‌.. విజయకాంత్‌ మృతిపై ప్రధాని మోదీ సంతాపం

ఆయనో లెజెండ్‌.. విజయకాంత్‌ మృతిపై ప్రధాని  మోదీ సంతాపం

కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే చీఫ్ విజయకాంత్‌  మృతి పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.  విజయకాంత్‌ మరణం చాలా బాధాకరమన్నారు.  తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయనో లెజెండ్‌. తన నటనతో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రాజకీయ నాయకుడిగా ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేశారు. నాకు మంచి మిత్రుడు. ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆయన కుటుంబానికి, అభిమానులకు, అనుచరులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి- అంటూ మోదీ ట్వీట్ చేశారు.  మరోవైపు విజయకాంత్  అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో పూర్తి చేయనున్నట్లు  తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. నేడు సంతాప దినంగా ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో సినిమా షోలను రద్దుచేసింది. 

 కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయకాంత్..  చెన్నైలోని మియాట్‌ ఇంటర్నేషనల్‌ ఆసుపత్రిలో చికిత్స  పొందుతూ 2023 డిసెంబర్  28 ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. విజయకాంత్ వయస్సు 71 ఏళ్లు.. నాలుగేళ్ల క్రితం పక్షవాతం రావటంతో మంచానికే పరిమితం అయ్యారు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. విజయకాంత్ మృతి పట్ల తమిళనాడు  సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.