విజయ్ 66.. ఫస్ట్‌లుక్‌ వచ్చేస్తోంది

విజయ్ 66.. ఫస్ట్‌లుక్‌ వచ్చేస్తోంది

తమిళ స్టార్ హీరో విజయ్ , దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా 'తలపతి 66' అని పేరు పెట్టారు. దిల్ రాజు ఈ సినిమాని  భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ  సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.   విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను ఒక్కరోజు ముందు అంటే  జూన్ 21 సాయంత్రం 6:01 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లుగా అధికారికంగా వెల్లడించారు. మోషన్ పోస్టర్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, ప్రభు, యోగి బాబు, షామ్, శ్రీనాథ్, ఖుష్బు, సంగీత, సంయుక్త షణ్ముగనాథన్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, కార్తిక్ పళని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి.