
లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చినట్టు… నిన్నగాక మొన్న ఇండస్ట్రీలో అడుగుపెట్టినా స్టార్ హీరోల సరసన చాన్స్ కొట్టేస్తోంది కియారా అద్వానీ. ‘భరత్ అనే నేను’లో మహేష్ బాబుతో కలిసి టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఆమె… తర్వాత ‘వినయ విధేయ రామ’లో రామ్‌చరణ్‌తో జోడీ కట్టింది. ఆపైన తెలుగులో నటించలేదు కానీ బాలీవుడ్‌లో భలే అవకాశాలు సంపాదించింది. ‘కబీర్‌సింగ్’తో భారీ హిట్టు కొట్టింది. గుడ్‌న్యూస్ , లక్ష్మీబాంబ్ చిత్రాల్లో అక్షయ్ కుమార్‌తో కలిసి నటిస్తోంది. ‘షేర్‌షా ’తో పాటు ‘ఇందూకీ జవానీ’ అనే ఫిమేల్ సెంట్రిక్ మూవీ కూడా చేస్తోంది. ఇంత బిజీగా ఉండి
కూడా కోలీవుడ్‌లో పాదం మోపేందుకు రెడీ అవుతోంది.
విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ రూపొందించే సినిమాలో కియారా హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇది విజయ్‌కి అరవై నాలుగో సినిమా. ‘బిగిల్’ పూర్తయిన తర్వాత సెట్స్‌కి వెళ్లనుంది. విజయ్ లాంటి స్టా ర్ హీరోతో ఎంట్రీ ఇస్తోందంటే కోలీవుడ్‌లోనూ జెండా పాతినా పాతేస్తుంది.