వికారాబాద్, వెలుగు: ప్రభుత్వం రాయితీపై అందజేస్తున్న వ్యవసాయ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో బుధవారం వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 43 మంది రైతులకు రాయితీపై రొటావేటర్, కల్టివేటర్, తైవాన్ ప్రేయర్లను ఆయన అందజేశారు.
ప్రభుత్వం రాయితీపై వ్యవసాయ పరికరాలతోపాటు పిచికారి యంత్రాలను కూడా అందజేస్తుందన్నారు. మరోవైపు రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం అన్ని శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
