- వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్
వికారాబాద్, వెలుగు: జిల్లాలో లైసెన్స్ సర్వేయర్ల పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్ లో సర్వేయర్ల పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ హైస్కూల్(బాలుర)లో ఈ నెల 26న 106 మంది కొత్త అభ్యర్థులతో పాటు, ఇంతకుముందు పరీక్షలో ఫెయిల్ అయిన 35 మందికి పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు పరీక్షలు ఉంటాయన్నారు. అభ్యర్థులు గంట ముందే సెంటర్కు రావాలన్నారు. సమావేశంలో ఏడీ సర్వే ల్యాండ్ రామ్ రెడ్డి, స్కూల్ హెచ్ఎం రాజు, ఎస్సై గిరి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
