వికారాబాద్ పోలీసుల తనిఖీలు.. రూ. 9 లక్షల నగదు స్వాధీనం

వికారాబాద్ పోలీసుల తనిఖీలు.. రూ. 9 లక్షల నగదు స్వాధీనం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 3 వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో సామాన్యులు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్లడానికి వీలులేదు. 

Also Read :- బీఆర్ఎస్ అసంతృప్తులకు ప్రగతిభవన్ పిలుపు!

అయితే తాజాగా ఈరోజు(అక్టోబర్ 10) ఉదయం వికారాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా రూ. 9.5లక్షల నగదు పట్టుబడింది. ఈ నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని ఆరా తీశారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి కారు కొనేందుకు ఈ డబ్బులు తీసుకెళ్తున్నట్లు వికారాబాద్ సీఐ టంగుటూరి శ్రీను వివరించారు.