బీఆర్ఎస్ అసంతృప్తులకు ప్రగతిభవన్ పిలుపు!

 బీఆర్ఎస్ అసంతృప్తులకు ప్రగతిభవన్ పిలుపు!

బీఆర్ఎస్ అసంతృప్తులను సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లోనే కట్టడి చేస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్ రాని అసంతృప్తి నేతలకు ప్రగతి భవన్ లో పనులు అప్పగిస్తున్నట్లు సమాచారం. బొంతు రామ్మోహన్ కు మంత్రి కేటీఆర్ కార్యక్రమాలు చూసే బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. ఇటు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యే లు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిని ప్రగతి భవన్ లోనే ఉండాలని సీఎం ఆదేశాలు  ఆదేశాలు ఇచ్చినట్లు టాక్. 

ఉప్పల్  ఎమ్మెల్యే టికెట్ ఈ సారి స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి ఇవ్వకుండా  బండారి లక్ష్మారెడ్డికి కేటాయించారు సీఎం కేసీఆర్. దీంతో  ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వర్గం  అసంతృప్తిగా ఉంది.  ఎందుకు టికెట్ ఇవ్వలేదో చెప్పాలంటూ ఆయన అనుచరులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

 ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ఇవ్వకుండా కడియంశ్రీహరికి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో  అసంతృప్తితో ఉన్న రాజయ్య పార్టీ మారుతారనే ప్రచారం ఉంది.  ఇప్పటికే రాజయ్యకు రైతు బంధు ఛైర్మన్ పదవి అప్పగించారు కేసీఆర్. అయితే బయట ఉంటే ఏ క్షణమైనా పార్టీ మారే అవకాశాలున్నందున ప్రగతి భవన్ కు రావాలని పిలుపు వచ్చింది.

Also Read :- బతుకమ్మ చీరలపై ఫోటోలు

 ఇక జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఈ సారి టికెట్ ఇవ్వలేదు. జనగామ టికెట్ ను అధిష్టానం పెండింగ్ లోపెట్టింది. పల్లా రాజేశ్వర్ రెడ్డికి జనగామ టికెట్ ఇస్తారని ప్రచారం ఉంది. అసంతృప్తితో ఉన్న ముత్తిరెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్ పదవిని ఇచ్చారు కేసీఆర్ .అయినా ముత్తిరెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం వస్తుండటంతో  ప్రగతి భవన్ నుంచి పిలుపువచ్చింది.