నో చేంజెస్‌‌‌‌: మల్టీస్టారర్ తీయడమంటే అంత ఈజీ కాదు

నో చేంజెస్‌‌‌‌:  మల్టీస్టారర్ తీయడమంటే అంత ఈజీ కాదు

ఇద్దరు హీరోలకు ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఇస్తూ మల్టీస్టారర్ తీయడమంటే అంత ఈజీ కాదు. ఆ విషయంలో ఐదేళ్ల క్రితం వచ్చిన తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’ ఆశ్చర్యపరిచింది. విజయ్ సేతుపతి, మాధవన్  హీరోలుగా కాకుండా, వాళ్ల పాత్రలు మాత్రమే కనిపించేలా స్క్రీన్‌‌‌‌ ప్లేతో మేజిక్‌‌‌‌ చేశారు డైరెక్టర్స్​ పుష్కర్, గాయత్రి. ఈ సినిమా అదే పేరుతో హృతిక్ రోషన్​, సైఫ్ అలీ ఖాన్ హీరోలుగా హిందీలో రీమేక్ అవుతోంది. గ్యాంగ్ స్టర్‌‌‌‌‌‌‌‌గా హృతిక్, పోలీసాఫీసర్‌‌‌‌‌‌‌‌గా సైఫ్ నటిస్తున్నారు. ఆల్రెడీ సూపర్ హిట్ అయిన మూవీకి రీమేక్ కావడం, ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్స్‌‌‌‌ తీస్తుండడంతో అంచనాలు ఓ రేంజ్‌‌‌‌లో ఉన్నాయి. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 30న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ రిలీజ్ డేట్‌‌‌‌ పోస్ట్ పోన్ అవబోతోందని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

అయితే విడుదల తేదీలో ఎలాంటి మార్పులు లేవట. అనౌన్స్ చేసిన డేట్‌‌‌‌కి సినిమాను విడుదల చేయబోతున్నట్టు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే రక్షా బంధన్ సందర్భంగా ఈనెల 11న టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయబోతున్నారని, ఆమిర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ విడుదలవుతున్న థియేటర్స్‌‌‌‌లో ఈ టీజర్‌‌‌‌ను ప్రదర్శించనున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. టీమ్ నుంచి మాత్రం ఇంతవరకూ ఎలాంటి అఫీషియల్‌‌‌‌ కన్‌‌‌‌ఫర్మేషన్ రాలేదు. రాధికా  ఆప్టే, రోహిత్ సరఫ్, షరీబ్ హష్మీ, యోగితా బిహాని ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని  వై నాట్ స్టూడియోస్‌‌‌‌, రిలయన్స్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్‌‌‌‌, టి సిరీస్‌‌‌‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.