
‘ట్వల్త్ ఫెయిల్’ చిత్రం సూపర్ హిట్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీ అయ్యాడు బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే. తాజాగా తను నటిస్తున్న మరో సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. ‘ఆంఖోన్ కి గుస్తాఖియాన్’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోందని ప్రకటిస్తూ, ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
సంతోష్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో సన్యా కపూర్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో విక్రాంత్, సన్యా గుర్రంపై కూర్చొని కలర్‌ఫుల్ వైబ్‌తో ఇంప్రెస్ చేస్తున్నారు. ‘ఫీల్ ద మేజిక్ ఆఫ్ ఫస్ట్ లవ్’ అంటూ క్యాప్షన్ ఇవ్వడం క్యూరియాసిటీని పెంచుతోంది.
ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. జులై 11న సినిమా విడుదల కానుంది. జీ స్టూడియోస్, మినీ ఫిల్మ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. విశాల్ మిశ్రా సంగీతం అందిస్తున్నాడు.
Two hearts. One love. And countless Gustaakhiyan 💞🎶#AankhonKiGustaakhiyan Teaser Out Tomorrow!
— Zee Studios (@ZeeStudios_) June 4, 2025
Come feel the love on 11th July in cinemas near you.@VikrantMassey #ShanayaKapoor #UmeshKrBansal @minifilmsindia @mansibagla @varunbagla @singhiskingh @vishalMMishra… pic.twitter.com/QRZAyXK57E