
న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌తో ఒప్పందం కోసం ఎటువంటి చర్చలూ జరపడం లేదని టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా మంగళవారం ప్రకటించింది. వాటా కొనుగోలుకు అవకాశం ఉందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. తాము కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తామని పేర్కొంది.
దేశంలోని టెలికాం రంగంలోకి తొలిసారిగా ప్రవేశించేందుకు స్టార్‌లింక్ వోడాఫోన్ ఐడియాతో జతకట్టవచ్చనే ప్రచారం వల్ల వీఐ షేర్లు సోమవారం పెరిగాయి. స్టార్‌లింక్ భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు వీలుగా ప్రభుత్వం వీఐఎల్‌లో తన 33.1 శాతం వాటాను మస్క్‌కు విక్రయించవచ్చని ఊహాగానాలు కూడా విస్తృతంగా ఉన్నాయి. మస్క్ వచ్చే వారం వైబ్రెంట్ గుజరాత్ బిజినెస్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు మనదేశానికి వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలు వినిపించాయి.