పల్లెలు బాగుపడాలె,పల్లెల అభివృద్ధితొ

పల్లెలు బాగుపడాలె,పల్లెల అభివృద్ధితొ

పల్లెల అభివృద్ధితోనే సంపూర్ణ వికాసం సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్‌‌‌‌ అన్నారు. ‘సమగ్ర గ్రామ వికాసమే ప్రభుత్వ లక్ష్యం. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత బాగా పెరగాలి. ఇందుకోసం సర్పంచులకు, ఉప సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇవ్వాలి’ అని అధికారులకు ఆయన సూచించారు. త్వరలోనే ప్రతి పంచాయతీ కార్యదర్శిని నియమిస్తామన్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్‌‌‌‌ ప్రవేశపెడుతామని, అప్పుడే పంచాయతీలకు నిధులు ఇచ్చేవీలుంటుందని తెలిపారు.

ఆ నిధులను సరిగ్గా వినియోగించు కోవాలంటే పంచాయతీ పాలకవర్గానికి సంపూర్ణ అవగాహన ఉండాలని, ఆ దిశగానే శిక్షణ కార్యక్రమాలు కొనసాగాలన్నారు. కొత్త సర్పంచ్‌ లకు, ఉప సర్పంచ్‌ లకు, కార్యదర్శులకు ఇచ్చే శిక్షణపై అధికారులు, ఎమ్మెల్యేలతో శుక్రవారం ప్రగతిభవన్‌‌‌‌లో సీఎం కేసీఆర్‌‌‌‌ సమీక్షించారు. ఫిబ్రవరి నుంచి మే వరకు పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. పంచాయతీలను అద్భుతంగా తీర్చిదిద్దడంలో గ్రామ పాలకులకు సమగ్ర అవగాహన అవసరమని, కొత్త పంచాయతీరాజ్‌‌‌‌ చట్టం పైనా అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామ సమగ్ర వికాసానికి పాటుపడే ఉద్యమకారులుగా తీర్చిదిద్దాలని, నిర్లిప్తత పనికిరాదని హితవుపలికారు. పల్లెల ప్రగతి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకు వచ్చిందని సీఎం తెలిపారు. హరితహారంతో ప్రతి పల్లెను పచ్చని పల్లెగా తీర్చిదిద్దాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌ రెడ్డి , కాలే యాదయ్య, మర్రి జనార్దన్‌‌‌‌రెడ్డి , సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌‌‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.